జూలూరుపాడు మండల పరిధిలోని సాయిరాం తండాకు చెందిన గిరిజన రైతు కిషన్ కు జూలూరుపాడు బ్యాంకులో సేవింగ్ ఖాతా కలిగి ఉన్నాడు గత మూడు రోజులుగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తమ ఖాతాను నిలుపుదల అయ్యే అవకాశం ఉందని చెప్పాడు.దీంతో రైతు బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకుంటానని చెబుతూ వస్తున్నాడు.ఈ క్రమంలో బుధవారం సైబర్ నేరగాడు మళ్ళీ ఫోన్ చేయక రైతు భార్య లీలా లిఫ్ట్ చేసి మాట్లాడింది.. బ్యాంకు అధికారి ఆకాశ వర్మ అంటూ వాట్సాప్ లో ఐడి కార్డు పెట్టాడు.. నమ్మిన భార్య చెప్పండి సార్ అంటూ బదిలీ ఇచ్చింది. మీ బ్యాంక్ ఖాతా ప్రాసెస్ పూర్తి చేస్తున్నాను మీకు వచ్చిన ఓటీపీ నెంబర్ చెప్పాలంటే పేర్కొన్నాడు