అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయాన్ని శనివారం 11 నుంచి నాలుగు వరకు జేఎన్టీయూలోని అన్ని విభాగాలను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫ్రొం స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జేఎన్టీయూ ఉపకళపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ జెఎన్టియు విశ్వవిద్యాలయానికి ఆరు నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్ ఐఎస్ఓ రావడం ఎంతో గర్వకారణంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి అందరూ కృషి చేయాలని ఉపకళపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ఓ ప్రతినిధులు హెచ్వోడీలు పాల్గొన్నారు.