ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా అంగన్వాడి పిల్లలతో పలు కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్వాడి టీచర్ ఈవీ దుర్గా మాట్లాడుతూ, ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించినట్లు తెలిపారు. పిల్లలకు కూర్చున్న చోటే పలు పోటీలు ఏర్పాటు చేసి విజేతలకు ప్రోత్సాహకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆగాను వాడి ఆయా లక్ష్మి, పిల్లలు, వారి తల్లులు పాల్గొన్నట్లు తెలిపారు.