అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని గొటుకూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ వెంచర్ లో యువకుడు చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని కూడేరు సిఐ రాజు శనివారం పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు కనగానపల్లి మండలం గుంతపల్లికి చెందిన అనిల్ కుమార్( 28 ) కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు అయితే ఆమె అంగీకరించకపోవడంతో ఘటనా స్థలంలో సెల్ఫీ వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు.