కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ కనీసం కూడు, గూడు, గుడ్డ ఇప్పించడంతోపాటు విద్య వైద్యాన్ని అందించినప్పుడే ప్రజలు కొంతైనా జీవన ప్రమాణాలను పెంచుకోవటానికి ఉపయోగపడుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు అన్నారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు శిక్షణ తరగతులను నిర్వహించారు. కార్మిక సంఘం సీనియర్ నాయకురాలు శకుంతల జెండా ఎగురవేశారు. అనంతరం క్లాసులను ప్రారంభిస్తూ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడారు.