నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో 11రోజులపాటు గణనాథుడి నిత్య పూజలు, భక్తి వేడుకలు ఘనంగా జరిగాయి. 'అడుగుల' భజనలు, బతుకమ్మ, డ్యాన్సులు, యువకుల ఊరేగింపుతో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర కొనసాగింది. ప్రత్యేక పూజలు నిర్వహించిన గణేష్ కమిటీ సభ్యులు, వినాయకుడి వద్ద ఏర్పాటు చేసిన లడ్డులను వేలం వేశారు. కొత్తపల్లి భగత్ సింగ్ యూత్ ఫ్రెండ్స్ యువకులు, గణనాథుని నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ వేడుకలు నారాయణపేట జిల్లాలో భక్తిశ్రద్ధలతో జరిగాయి.