అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు అనంతపురంకు వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం టోల్ గేట్ వద్ద అనంతపురంకు వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, వారి వాహనాలను అదుపులోకి తీసుకొని పెద్దవడుగూరు, వజ్రకరూరు, గుత్తి పోలీసు స్టేషన్లకు తరలించారు. చలో అనంతపురం కార్యక్రమం చేపట్టి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ మహబూబ్ నగర్, కర్నూలు, నంద్యాల, ఆదోని, గుంతకల్లు గుత్తి ప్రాంతాల వెళ్తున్న వారిని అరెస్ట్ చేశారు.