రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మండల బిజెపి నాయకులు. తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షుడు శ్రీధర్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కోలా అంజి గౌడ్ మాట్లాడుతూ నిన్నటి రోజున బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ పర్యటించి ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని దూషించినందుకు నిరసనగా మండల కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన