కామారెడ్డి జిల్లాలో అధిక వరదలు సంభవించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆహ్వానం మేరకు శనివారం రామకృష్ణ మట్ ఆధ్వర్యంలో రాజంపేట మండలంలోని నడిమి తండా, ఎల్లాపూర్ తాండ గ్రామాల్లో వైద్య శిబిరం నిర్వహించి చుట్టుప్రక్కల మొత్తం 7 తండాలకు చెందిన 293 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య శిక్ష చికిత్స చేశారు. రామకృష్ణ మట్ వైద్యులు డాక్టర్ శుష్మిత్, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ తేజశ్వినిలు ప్రజలను పరీక్షించి జలుబు, దగ్గు, తుమ్ములు, నొప్పులు, జ్వరం తదితర వ్యాధులను కనుక్కొని చికిత్స చేయడం జరిగింది.