రాయదుర్గం మండలంలోని పల్లేపల్లి గ్రామంలో చాముండి(20) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కర్ణాటకలోని కురుగడుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తితో ఏడాదిన్నర క్రితంవివాహమైంది. రెండు వారాల క్రితం పుట్టింటికి వచ్చింది. నాలుగు రోజుల క్రితం భర్త కూడా వచ్చాడు. బుధవారం రాత్రి బార్య, భర్త గొడవ పడ్డారు. ఇంటిలోనే నిద్రించారు ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున విగతజీవిగా పడివున్న బిడ్డను చూసి తల్లి నాగమ్మ, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అల్లుడే కొట్టి గొంతునులిమి చంపారని ఆరోపించారు. పోస్టుమార్టం కు తరలించి పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.