నరసాపురం రూరల్ కార్యాలయాన్ని గురువారం ఏలూరు రెంజ్ ఐజి జి.వి.జి అశోక్ కుమార్ సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎస్పీ అద్నాన్, డీఎస్పీ శ్రీ వేద, సీఐ దుర్గ ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయంలో పలు కేసులకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.