నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. MBBS నాలుగో సంవత్సరం చదువుతున్న రాహుల్ అనే విద్యార్థిపై సీనియర్లు (హౌస్ సర్జన్స్) ర్యాగింగ్కు పాల్పడి దాడి చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటన శనివారం జరగగా ఆదివారం మీడియాతో బాధితుడు మాట్లాడడు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా, 16 మంది వరకు ర్యాగింగ్ చేసినట్టు తెలిపారు. బూతులు తిడుతూ, డేట్ అఫ్ బర్త్ చెప్పమంటూ ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా ర్యాగింగ్, దాడి ఘటనపై ఫిర్యాదు అందిందని విచారణ జరుపుతున్నామని 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు.