గుడికల్: అక్రమ ఎర్రగరుసు తవ్వకంపై కఠిన చర్యలు: తహసీల్దార్..ఎమ్మిగనూరు మండలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా కొండల్లో, ప్రభుత్వ స్థలాల్లో ఎర్ర గరుసును అక్రమంగా తవ్వి తరలించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శేషఫణి హెచ్చరించారు. మంగళవారం గుడికల్ సమీపంలోని కోతిగట్టు కొండలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎర్రగరుసు తవ్వుతున్న ఘటనపై తహసీల్దార్ శేషఫణి, రెవెన్యూ సిబ్బందితో స్థలాన్ని పరిశీలించారు. తదుపరి అక్రమ తవ్వకాలను నిరోధించేందుకు ట్రాక్టర్లు, ఎక్స్కవేటర్లు సీజ్ చేస్తామని ఆయన తెలిపారు.