సిరికొండ మండలం లోని ముషీర్ నగర్ గ్రామంలో ఉప్పారం మల్లయ్య నివాస గృహంలో శనివారం షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ ఇల్లు పాక్షికoగా కాలిపోయింది. నిత్యవసర సరుకులు, వంట సామాగ్రి, బట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదంలో ఒక్క లక్ష అరవై వేల రూపాయల నగదు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగరాజు పంచనామా నిర్వహించారు.ఈ ప్రమాదంలో సుమారుగా నాలుగు లక్షల పదివేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన వెల్లడించారు.