నల్లగుట్లపల్లి మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్ ఓ వ్యక్తికి గాయాలు. చిత్తూరు జిల్లా .పుంగనూరు మండలం నల్లగుట్లపల్లి గ్రామ సమీపంలో పెద్దపంజాణి మండలం కొలుత్తూరు గ్రామానికి చెందిన శంకర కుమారుడు బాలాజీ 23 సంవత్సరాలు పుంగనూరు వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో బాలాజీ త్రివంగా గాయపడ్డాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాలాజి ని స్థానికులు పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వెలుగులో వచ్చింది.