విశాఖ రైల్వే స్టేషన్ లో సాధారణ తనిఖీలలో భాగముగా,జి ఆర్ పి ఇన్స్పె క్టర్ సి హెచ్ ధనంజయనాయుడు ఆద్వర్యం లో జి ఆర్ పి మరియు ఆర్ పి ఎఫ్ వారు సంయుక్తంగా సబ్-ఇన్స్పెక్టర్ కె టి ఆర్ లక్ష్మి మరియు, జె కె Meema, SIPF/RPF వారి సిబ్బంది తో కలిసి ఆదివారం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం లలో ముమ్మర తనికీలు చేసారు మైసూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రం కు చెందిన రసూల్,, షాదీక్ హుస్సేన్ లను విశాఖ రైల్వే స్టేషన్ మీదుగా గంజాయి ని బెంగుళూరు కు అక్రమముగా రవాణా చేయుచుండగా వారిని అదుపులోకి తీసుకొని, వారి నుండి Rs.50,000/- విలువగల 10 కేజీల గంజాయి ని సీజ్ చేసి,అరెస్ట్ చేశారు