రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజీ లేని పోరాటాలు చేస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి.రమేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఈ నెల 25న ఛలో కలెక్టరేట్ కు సంబంధించి గోడపత్రికలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడి సి.రమేష్, గుత్తి మండల అధ్యక్ష, కార్యదర్శులు బాలాజీ, నవీన్ యాదవ్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. జీవో నెం.77 రద్దు చేసి, పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని కోరారు.