నగరంలోని గోల్ హనుమాన్ నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. మొదట ఆయనను నూతన పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గోల్ హనుమాన్ దేవాలయ కమిటీ నూతన చైర్మన్ బండారి నరేందర్ తో పాటు పాలకవర్గ సభ్యులుగా తోడుపునూరి రామ్మోహన్, గుండ సుధీర్, కరిపె లింగం, క్యాసారం విజయకుమార్, ఉప్పరి స్వప్న, గంట జ్యోతిలతో షబ్బీర్అలీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోల్ హనుమాన్ ఆలయం చాలా పురాతనమైనది మరియు మహిమలు గల దేవాలయమన్నారు.