ఎల్లారెడ్డి:సీఎం రేవంత్ రెడ్డి వరదల కారణంగా జిల్లాలో దెబ్బతిన్న వంతెనలపై శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో కామారెడ్డి, ఎల్లారెడ్డిలో తీవ్రంగా దెబ్బతిన్న వంతెనలను, పంటలను వరదలతో దెబ్బతిన్న పంట పొలాలు, పోచారం ప్రాజెక్టును పరిశీలించారు. MLA మదన్ మోహన్.. పంట పొలాలకు జరిగిన నష్టాలను, దెబ్బతిన్న పోచారం ప్రాజెక్టు వివరాలను సీఎం, మంత్రులకు వివరించారు. సీఎం వెంట మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. లింగంపల్లి వంతెనపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుంది.