కాగజ్నగర్ పట్టణంలో గురువారం సిర్పూర్ పేపర్ మిల్లు నుండి వెలువడిన విషవాయువు పొగ రూపంలో పట్టణాన్ని కమ్మేసింది. దీనితో ప్రజలు శ్వాస కోశ వ్యాధులు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఎస్పీఎం యజమాన్యం పట్టణ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతుందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు ఎస్పీఎం యజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణం ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు,