గత కొంతకాలంగా జడ్చర్ల నియోజకవర్గంలో నెలకొన్న యూరియా సమస్య త్వరలో తీరనుంది. ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ గోపితో ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న యూరియా సమస్యను కమిషనర్ కు వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, రేపటిలోగా యూరియాను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు