జానకీ నగర్ స్టేజ్ వద్ద గల ఇండియన్ ఆయిల్ బంకులో పార్క్ చేసిన లారీలో డీజిల్ చోరీకి గురైంది.సీతారాంపురం గ్రామానికి చెందిన గన్నప్రసాద్ లారీని రాత్రి బంకులో నిలిపి ఉంచగా, ఉదయం వచ్చి చూసేసరికి ట్యాంకులో ఉన్న సుమారు 200 లీటర్ల డీజిల్ కనిపించలేదు. ఈ ఘటనపై లారీ యజమాని ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.