ఈనెల 27న వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్మికుల రాష్ట్ర రెండవ మహాసభను జయప్రదం చేయాలని AITUC జిల్లా కార్యదర్శి ఓమయ్య పిలుపునిచ్చారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని గుమస్తా సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఈనెల 27వ మార్కెట్ యార్డులోని ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర హామాలి దడువాయి చాట గుమస్తా స్వీపర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర రెండవ మహాసభలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ శాసనసభాపక్ష నాయకులు కూనంనేని సాంబశివరావు, రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి హాజరుకానున్నారు.