జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశు వైద్య శాఖ, డిఆర్డిఏ శాఖలతో జిల్లా స్థాయి కాన్సెర్వెన్సీ సమావేశం బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రసాయనక ఎరువులు, పురుగుమందుల వినియోగించకుండా, జీవసంబంధమైన పదార్థాలను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటికే 75 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు నడుస్తోందన్నారు.