అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామ సమీపంలో శనివారం రాత్రి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వజ్రకరూర్ పోలీసులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు. వజ్రకరూరు ఎస్సై నాగ స్వామి రెవిన్యూ శాఖ సీ ఎస్ డి టీ సుబ్బలక్ష్మిలు తెలిపిన వివరాల మేరకు గడేహోతూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని అటు స్వాధీనం చేసుకుని 14 బ్యాగులను (6.7 క్వింటాళ్ల ) రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసామని ఎస్ఐ పేర్కొన్నారు.