ధర్మవరం పట్టణంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. పాల్తూరి రామకృష్ణ భగవంతపు రామాంజనప్ప అనే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు కొద్దిరోజులుగా ధర్మవరం పట్టణంలో పగలు రెక్కి నిర్వహిస్తూ రాత్రిపూట దొంగతనాలకు పాల్పడేవారు. మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులు సైతం తస్కరించేవారు. ఈ ఘటనలపై పోలీసులు నిఘా ఉంచి శనివారం అరెస్టు చేశారు. వీరి నుండి తొమ్మిది లక్షల విలువ గల బంగారు ఆభరణాలు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు.