సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. వంట గదికి వెళ్ళి అన్నం కూరగాయలు పరిశీలించారు. రుచికరంగా వండాలని కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని వంట సిబ్బందిని ఆదేశించారు. పక్కన మిషన్ భగీరథ వాటర్ వృధాగా పోతూన్నట్లు గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భగీరథ నీరు వృథాగా వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అన్ని తరగతి గదులు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు.... విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని బాగా చదవాలని హాస్టల్ మంచి అలవాట్లను బాగా నేర్పిస్