చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు పురస్కరించుకొని అవగాహన సమావేశం సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కంటిపాప పైన అద్దంలా ఉండే కార్నియా స్వచ్ఛత పాడైపోయి కంటిచూపు మందగించడం జరుగుతుందన్నారు. నేత్రదానం ద్వారా నేత్రం యొక్క కార్నియా మార్పిడి చేయడంతో పోగొట్టుకొన్న కంటిచూపును తిరిగి పొందవచ్చునని ఆయన తెలిపారు