సిపిఎస్ విధానం రద్దుచేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మాసాయిపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయుల సమస్యలపై తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం నాయకులు తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. సిపిఎస్ విధానం ద్వారా ఎంతో మంది ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేసి ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరారు. పాత పెన్షన్ విధానం కోసం తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం పోరాటం చేస్తుందని తెలిపారు