ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వడం అంటే సమాజాన్ని గౌరవించినట్టే అని డిప్యూటీ స్పీకర్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అన్నారు ఈరోజు దంతాలపల్లి మండల కేంద్రంలో జరిగిన గురుపూజోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని, వారు కేవలం పాఠాలు బోధించేవారు మాత్రమే కాదని విద్యార్థుల్లో మంచి విలువలు క్రమశిక్షణ సమాజానికి ఉపయోగపడే పౌరసత్వాన్ని పెంపొందించే వ్యక్తులని,గురువుల త్యాగం సేవల వాళ్ళనే ఈ రోజు అనేక మంది ప్రతిష్టాత్మక స్థానాల్లో వెలుగొందుతున్నారని అన్నారు.అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు .