తెలంగాణ సాంప్రదాయాలకు ఆచారాలకు ప్రతిక బతుకమ్మ పండుగ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రంగురంగుల పూలతో గౌరమ్మను కొలుచుకుంటూ ఆనందంగా బతుకమ్మ పాటలు పాడుతూ అందరూ చల్లగా ఉండాలని అక్క చెల్లెలు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం మంచి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు