రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట గ్రామంలో శనివారం మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో సుమారు గంట పాటు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నాను విరమింపజేశారు. అనంతరం ఏబీవీపీ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు.ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు అత్యం నాగరాజు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా కూడా రోడ్ల పరిస్థితి బాగాలేదని, ముఖ్యంగా అనంతరం గ్రామం నుంచి రహీంఖాన్ పేట గ్రామం వరకు రావాలంటే ప్రజలు నరకయాత్ర అనుభవిస్తున్నారని అన్నారు. పెద్ద పెద్ద