నల్గొండ జిల్లా, దేవరకొండ పట్టణంలో అడిషనల్ ఎస్పీ మౌనిక గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ నెలలో దేవరకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు పిట్ట గంగాధర్ ను అరెస్ట్ చేసి, అతని వద్దనుండి రూ.2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దొంగతనంలో రూ.6 లక్షల నగదు, 2.2 తులాల బంగారం చోరీకి గురైందని, నిందితుడు గంగాధర్ పై 100కు పైగా దొంగతనం కేసులు ఉన్నాయని అడిషనల్ ఎస్పీ మౌనిక పేర్కొన్నారు.