ఇసుక లారీల వద్ద అక్రమ వసూళ్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని గురువారం ఉదయం డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఏటూరునాగారం-పస్రా వరకు చెక్పోస్టులు, వే-బ్రిడ్జిల వద్ద అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. చిన్నబోయినపల్లి వద్ద అవసరం లేకున్నా ఓవర్ లోడ్ ఉందంటూ లారీ కాంటాపై ఎక్కిస్తున్నారని దీంతో తాము అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.