యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట గ్రామానికి చెందిన రైతు భాస్కర్ గౌడ్ తన పత్తి చేలో పనిచేస్తుండగా పాముకాటుతో మృతి చెందినట్లు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే రైతు భాస్కర్ గౌడ్ మృతి చెందినట్లు తెలిపారు. కాగా మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భాస్కర్ గౌడ్ మృతితో బేగంపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.