Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 24, 2025
కావలిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ కావలి జిల్లా సాధన సమితి సభ్యులు పులి రజిని, చక్రపాణి, భాస్కర్, ఆదివారం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి కరపత్రాలను ఆవిష్కరించారు. కావలిజిల్లా ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. కావలి జిల్లా ఏర్పడితే జరిగే అభివృద్ధి, జిల్లాగా ఏర్పడకపోతే జరిగే నష్టాలను ప్రజలకు వివరించడానికి ఈ కరపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు కావలి జిల్లా సాధన సమితి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.