పలమనేరు: పట్టణంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలో, విలువలతో కూడిన అవగాహన సదస్సును ముఖ్య అతిథిగా హాజరైన మాదేశ్ నిర్వహించి మాట్లాడారు, విద్యార్థినీ విద్యార్థులు ఎంతో కష్టపడి తమ ఆశయాలకు అనుగుణంగా చదువుకోవాలని, పిల్లలను తల్లిదండ్రులు చదువు కోసం దూరప్రాంతాలని చూడకుండా పంపించి చదువుకోడానికి కృషి చేస్తున్నారన్నారు. చదువుకోవాల్సిన వయసులో ప్రేమ పేరుతో ఆకర్షణలో పడకుండా విద్యార్థులు తల్లితండ్రుల ఆశయాలను ప్రతి ఒక్కరు నెరవేర్చాలన్నారు.