అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు అర్చనలు ప్రధాన పూజారి సీతా రామ్మోహన్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన పూజారి సీతా రామ్మోహన్ శర్మ ఆలయ కార్యనిర్వాహణాధికారి బాబు మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆదివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు అర్చనలు పల్లకి సేవ మూల మంత్ర బీజాక్ష హోమాన్ని కూడా భక్తులు కోరిక మేరకు నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన పూజారి సీతా రామ్మోహన్ శర్మ ఆలయ కార్యనిర్మాణాధికారి బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.