జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం సాయంకాలం 6 గంటలకు అనాకోడేరు, ఎల్.జి.పాడు గ్రామాల్లో ప్రభుత్వ భూముల ఫేజ్-3 రీ సర్వేను పరిశీలించారు. సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనాకోడేరు పంచాయితీ ఈలంపూడి గ్రామ రేషన్ షాపును తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల 26వ తేదీ నుండి ఇంటి వద్దనే రేషన్ అందించాలని సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులను కూడా పంపిణీ చేశారు.