ఈనెల 13వ తారీకు ఛలో విజయవాడ సందర్భంగా ఈరోజు సింగ్ హోటల్ జంక్షన్ వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికులు గోడపత్రిక విడుదల చేశారు.ఈ సంద ర్భంగా పవన్ నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కే నర్సింగరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సెజ్ మళ్లీ పునరుద్ధరించాలని, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించే విధంగా సిమెంటు, ఇనుము, చిప్స్ రేట్లు అందుబాటులో ఉంచాలన్నారు.అలాగే ఇసుక ఫ్రీగా లభించాలని 10,000 మందితో ఈనెల విజయవాడ లో ప్రదర్శన జరగబోతుందని భువన నిర్మాణ కార్మిక సంఘం నాయకులందరూ విచ్చేస్తారని, దీనిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.