రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు పెడుతుందని నిరసిస్తూ పలాస వైకాపా కార్యాలయం ఎదుట మాజీమంత్రి అప్పలరాజు తన అనుచరులతో కలిసి శనివారం సాయంత్రం ఫ్లాకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందని, గిట్టుబాటు ధర లేక రైతులు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తు చేశారు.