ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన సమాచారం మేరకు రెండు ద్విచక్ర వాహనాలు గేదెరెదురుగా ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలుగా స్థానికులు 108 కు సమాచారం అందించడంతో కాలం చెల్లిన 108 వాహనం లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు కాలం చెల్లిన 108 వాహనం కారణంగా మృతి చెందినట్లు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు