పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులను జిల్లా అధికారులు చొరవ తీసుకొని యుద్ధప్రతిపాదికన పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టరెట్లో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫిర్యాదులపై దృష్టి సారించాలన్నారు. మొత్తం 76 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.