ప్రస్తుత పర్యాటక సీజన్లో గిరిజన హోం స్టేలు ఏర్పాటు చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో మేడ్ ఇన్ అరకు ఉత్పత్తులు విక్రయించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని జిల్లా కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పర్యాటకులు, గిరిజన గ్రామాల్లో రాత్రి మకాం చేయడానికి అనువుగా ఉండే విధంగా హోం స్టేలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.