ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆయన పర్యటనపై BRSV రాష్ట్ర కార్యదర్శి దశరథ్ మాట్లాడారు. విద్యార్థుల డబ్బులతో నిర్మించిన హాస్టల్ భవనాలను సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభించి రాజకీయం చేశారని ఆరోపించారు. సీఎం రాకను నిరసిస్తూ BRSV విద్యార్థి నాయకులు ఠాగూర్ ఆడిటోరియాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసి నిరసన తెలిపారు.