ఈరోజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో వర్ధన్నపేట నగరంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్రలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా సోమవారం రాత్రి 9:30 గంటలకు ఆయన మాట్లాడుతూ పేదవారి కళలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు ఓరుగల్లు రాజకీయాలకు కేరాఫ్ అని గతంలో వర్ధన్నపేటలో ఎలక్షన్స్ సమయంలో తాను చెప్పినట్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆయన గుర్తు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఓడిపోతాడని చెప్పానని ఆయన తెలిపారు.