అమెరికా విధించిన టారీఫ్ లు దేశ రైతులపై ప్రభావం చూపనివ్వబోమని, రైతుల ప్రయోజనాలే ప్రధానం అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భీమవరం పెద అమిరం ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న ఆక్వా ఎక్స్ ఇండియా ఎగ్జిబిషన్‌ను ఆయన గురువారం సాయంకాలం 6 గంటలకు సందర్శించారు. ఈ సందర్భంగా 20 రాష్ట్రాల నుంచి ఏర్పాటు చేసిన 85 స్టాల్స్‌ను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ, అమెరికా టారీఫ్‌లతో ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు భరోసా కల్పించేందుకు కొత్తగా 20 దేశాల్లో మార్కెట్ సౌకర్యం కల్పించామని తెలిపారు.