ఆంధ్రప్రదేశ్ ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దానిలో భాగంగానే విశాఖలోని కేజీహెచ్ తో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని, నిధులు కేటాయిస్తున్నామని, వైద్యులను, సిబ్బందిని నియమిస్తున్నామని పేర్కొన్నారు. కేజీహెచ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో సుమారు రూ.42 కోట్లతో సమకూర్చిన అధునాతన వైద్య పరికరాలను, స్క్రీనింగ్ యంత్రాలను ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. వాటిలో లీనియర్ యాక్సిలరేటర్ (రూ.25 కోట్లు),గా ఉన్నాయి