మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ పాఠశాలలో సోమవారం ఉదయం 11:00 లకు మండల స్థాయి టీచర్స్ లెర్నింగ్ మెటీరియల్ మేళా నిర్వహించినట్లు మండల విద్యాధికారి రామ్మోహన్ రావు తెలిపారు. ఈ మేళా ద్వారా విద్యార్థులకు బోధన మీద ఆసక్తి పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. మండల స్థాయిలో గెలిచిన విద్యార్థులు మంగళవారం మహబూబాబాద్ జిల్లా స్థాయిలో జరిగే మేళాకు సెలెక్ట్ అవుతారని తెలిపారు. కార్యక్రమంలో వెంకటయ్య ఉన్నారు.