మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి వెంటనే నిపుణుల సలహా తీసుకోవాలని మానసిక ఆరోగ్య నిపుణుడు డాక్టర్ మధు మోహన్ అన్నారు. సెప్టెంబర్ 10న జరుపుకునే ప్రపంచ ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్య నిపుణుడు జిన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాట్లాడుతూ. ఆత్మహత్యలు నివారించగలిగినవేనని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం ప్రతి ఒక్కరు ఆత్మహత్య నిరోధంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.